.

పెళ్లైన కొత్తలో - 1 ...

అది నా పెళ్ళైన కొత్తలో ... మా ఆవిడ కు వంట రాదు అన్న సంగతి నాకు తెలిసెటప్పడికి 1 నెల పట్టింది. సరే తాను నేర్చుకుని వండుతుండీలె అని ఎదురు చూస్తున్నాను.
2 నెలలకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది.... అప్పుడు మొదలినది నా అసలు కష్టాలు.
రోజు వంట చేయడం మొదలు పెట్టింది. కూరలు ఏమిటి అనుకున్నారు ...

మొదటి రోజు : చప్పిడి పప్పు మరియు వూరగాయ
రెండో రోజు : తోటకూర పప్పు
మూడో రోజు : బంగాళదుంప పప్పు (ఇది మొదటి సారి తిన్నానులే)
నాల్గో రోజు : వెజిటబుల్ పప్పు ( టమోటా, కారెట్, పచ్చిమిరపకాయలు, సొరకాయ, వంకాయ + పప్పు)
అయిదో రోజు : పప్పులో ఇంకేదో ...
ఆరో రోజు : టమోటా పప్పు / శెనివారం కదా ఉపవాసం
ఏదో రోజు(ఆదివారం) : ఈరోజు సెలవే... ఆఫీస్ ఉండదు కదా అందుకని బయటకు వెళ్ళి తినడం ...

ఈ మెనూ 6 నెలలు రిపీట్ అయ్యింది ....
నేను చెయ్యడానికి నాకు అన్నం తప్ప మరేమీ వంట రాదు( అన్నం వండటాన్ని వంట అనరేమో)..
మొత్తం మీద ఏవో వంటల పుస్తకాలు చదివి నేను మా ఆవిడ, వంట చెయ్యడం మొదలు పెట్టాం. మొదట్లో బాధగా / విరక్తి గా / నీరసం గా / ఎలానో అనీపిచేడి తిన్తున్తె...తర్వాత చాలా బాగుంది అనుకొంది. మరి నాకో అలవాటు అయ్యిందో లేక నాకు వంట చెయ్యడం వచ్చిందో తెలీదు. నేను మా ఆవిడకు కూడా నేర్పాను అనుకోండీ.
నేను 6 సంవత్సరాలు నేర్చుకోలేని వంట ( రూమ్ లో ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ) ...
1 నెలలో వచ్చేసింది (పెళ్లి అయ్యిన తర్వాత)....

టైమ్ బాబు టైమ్...
తాత్పర్యం : పెళ్లి అయితే పెళ్ళాం తో పాటు వంట కూడా వస్తుంది



No comments:

Post a Comment